నేడు జిల్లాలో మంత్రుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

కల్వకుర్తి/కందనూలు: జిల్లాలో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎకై ్సజ్‌, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. మొదట తిమ్మాజిపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయ నూతన భవనం, కొత్తబస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నాగర్‌కర్నూల్‌–వనపర్తి మధ్య నూతన బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. సాయంత్రం కొల్లాపూర్‌కు చేరుకుని బస్టాండ్‌లో క్రూ రెస్ట్‌రూమ్‌ల నిర్మాణం, పెంట్లవెల్లి బస్టాండ్‌ ప్రాంగణంలో సీసీ, నూతన మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement