సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపుగా పూర్తికావొచ్చింది. వాటిని పూరించడంపై బీఎల్‌ఓలు, రెవెన్యూ అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లకు కలిగే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. డబుల్ ఓట్లు కలిగిన వారు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలి. బీఎల్‌ఓలు ఫారాలు తీసుకునేందుకు ఇంటికి వెళ్లి సేకరించి, ఫారాలను నింపుతున్నారు. విద్యావంతులు, రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్లు సహకరించినట్లయితే ఓటరు జాబితా ఆన్‌లైన్ చేయడం సులభతరం అవుతుంది. ప్రతి దరఖాస్తును క్షేత్రస్తాయిలో జాగ్రత్తగా పరిశీలించి.. పొరపాట్లకు తావులేకుండా చూస్తున్నాం.
– యాదగిరి, ఆర్డీఓ, అచ్చంపేట


