జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం త్వరగా అమలు చేయాలి. నేను యాపట్ల నుంచి కళాశాలకు వస్తాను. ఉదయమే టిఫిన్ తీసుకొని రావాలంటే బస్సు వచ్చే సమయానికి ఇంట్లో వంట కావడం లేదు. అందువలన ఒక్కోసారి మధ్యాహ్నం టిఫిన్ తీసుకోకుండానే వస్తున్నాను. – దీపిక,
బాలికల జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్
ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే ప్రవేశపెట్టాలి. నేను కుమ్మెర గ్రామం నుంచి ఉదయమే కళాశాలకు చేరుకునే సమయంలో ఇంటి దగ్గర వంట కాకపోవడంతో టిఫిన్ తీసుకోకుండానే వస్తున్నాను. ఒక్కొక్క సమయంలో మా ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తాను. లేదంటే సాయ ుంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తింటాను.
– నందిని, బాలికల జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్


