కేజీబీవీలకు యూనిఫాంలు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలకు యూనిఫాంలు

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

బల్మూర్‌ కేజీబీవీలో చదువుకుంటున్న విద్యార్థులు (ఫైల్‌)

అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యలో చదువు మానేసిన పేద, మధ్య తరగతి బాలికలను మళ్లీ చదువుబాట పట్టించి.. ఇంటిని మరిచిపోయేలా ఆకర్షనీయమైన భోజనం, వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించి ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కస్తూర్బా గాంధీ విద్యాలయ (కేజీబీవీ)లను ప్రారంభించింది.

ఆలస్యంగా వచ్చిన వస్త్రం..

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. అయితే సకాలంలో వస్త్రం అందకపోవడంతో విద్యార్థినులు పాత దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా 6వ తరగతిలో చేరిన బాలికలు సైతం యూనిఫాం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ బాలికలకు ఏకరూప దుస్తులు అందించేందుకు వస్త్రం జిల్లాకేంద్రానికి చేరింది. అధికారులు ఈ వస్త్రాన్ని జిల్లాలోని ఎస్‌హెచ్‌జీలకు అందజేసి త్వరగా కుట్టాలని సూచించారు. జిల్లాలో మొత్తం 20 కేజీబీవీలు ఉండగా.. ఇందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 4 వేల మంది విద్యార్థి నులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇంటర్‌ రెండో సంవత్సరాల్లో 3,120 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కేజీబీవీలకు చెందిన బాలికల యూనిఫాం కోసం పంజాబీ టాప్‌లకు (ఒక జత) 15,100 మీటర్లు, పంజాబీ బాటమ్‌ (రెండు జతలు) 24,160 మీటర్లు, సూట్‌లకు (రెండు జతలు) 15,300 మీటర్ల వస్త్రం ప్రభుత్వం నుంచి అందింది. ఇప్పటికే ఎస్‌హెచ్‌జీలకు అందజేసి కుట్టడం ప్రారంభమైంది. త్వరలో కుట్టడం పూర్తి చేసి బాలికలకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాకు చేరిన మొత్తం వస్త్రం 54,560

మీటర్లు

జిల్లాలోని 20 పాఠశాలలు, కళాశాలలకు చేరిన వస్త్రం

ఎస్‌హెచ్‌జీలకు కుట్టు బాధ్యత అప్పగింత

త్వరలో అందజేస్తామంటున్న అధికారులు

కళాశాలల్లో

చదువుతున్న

విద్యార్థులు

3,120

ఎస్‌హెచ్‌జీలకు అందించాం..

కేజీబీవీలలోని బాలికలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తుల వస్త్రం ఎస్‌హెచ్‌జీలకు అందించాం. వారు ఇప్పటికే డ్రెస్సులు కుట్టడం ప్రారంభించారు. వేగవంతంగా స్టిచ్చింగ్‌ చేయించి బాలికలకు వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటాం. – లలిత, ఎస్‌ఓ, కేజీబీవీ బల్మూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement