బల్మూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా హౌజింగ్ పీడీ గోపాల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండనాగులలో బుధవారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులతో మాట్లాడారు. బిల్లుల చెల్లింపులు, అధికారుల పర్యవేక్షణ తీరు తదితర అంశాలు అడిగి తెలుసుకున్నా రు. బల్మూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో హౌజింగ్ అధికారులు, గ్రామ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై గ్రామాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి పురోగతి నివేదికలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీఓ రేవత్‌రెడ్డి, హౌజింగ్ డీఈ హరినాయక్, ఏఈ నర్సింహ పాల్గొన్నారు.


