పుస్తకాల దందా! | - | Sakshi
Sakshi News home page

పుస్తకాల దందా!

Jun 29 2026 12:59 AM | Updated on Jun 29 2026 12:59 AM

వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేటు స్కూళ్లు

నర్సరీ నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల అమ్మకాలు

మరికొన్ని బుక్‌స్టాళ్లతో రహస్య ఒప్పందాలు

తల్లిదండ్రులపై మోయలేని భారం

అచ్చంపేటలోని ఓ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల స్థానికంగా ఒక బుక్‌స్టాల్‌తో ఒప్పందం

కుదర్చుకుంది. పాఠశాలలోని విద్యార్థులను

అదే బుక్‌స్టాల్‌లో పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో పాఠశాలలో మూడో తరగతి పుస్తకాలకు రూ. 3వేలు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి వాపోయారు. ఇంకో స్కూల్‌లో

పదో తరగతి డీజీ మ్యాగ్నమ్‌ వర్క్‌బుక్స్‌కు రూ. 2,700 తీసుకుంటున్నారు. నర్సరీ

పుస్తకాలకు సైతం రూ. 2వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇలా జిల్లాలోని పలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల వ్యాపారం చేస్తూ.. నిబంధనలకు

నీళ్లొదులుతున్నారు.

అచ్చంపేట: ిపల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే చాలు.. అనేక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, గైడ్స్‌, టై, బెల్టులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చివరకు యూనిఫామ్‌లను కూడా నిర్దేశిత దుకాణంలోనే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఆదేశిస్తున్నారు. ఇలా నర్సరీ నుంచే తల్లిదండులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు బహిరంగ రహస్యమే అయినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు.

పాఠశాల ఎదుటే దుకాణాలు..

ప్రైవేటు స్కూళ్ల ఎదుటే యాజమాన్యాలు షట్టర్లు తీసుకుని టెస్ట్‌, వర్క్‌బుక్స్‌, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. అన్నీ అక్కడే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మార్పీ ధరల ప్రకారం పాఠ్యపుస్తకాల విక్రయానికి డీఈఓ అనుమతి అవసరం. కానీ చాలా చోట్ల పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిగా విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కంటే 30నుంచి 40శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. కొందరు ధైర్యంచేసి ప్రశ్నిస్తే.. అడ్మిషన్‌ రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

తరగతుల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల ధరలు ఇలా (రూ.లలో)..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement