దోపిడీని అరికట్టాలి.. | - | Sakshi
Sakshi News home page

దోపిడీని అరికట్టాలి..

Jun 29 2026 12:59 AM | Updated on Jun 29 2026 12:59 AM

జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అడ్డూ అదుపులేకుండా విద్యను వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాల విక్రయాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నాయి. పాఠశాల లోపల, బయట వర్స్‌బుక్స్‌, టై, బెల్ట్‌, షూ, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టి, పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

– అనిల్‌కుమార్‌, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు

లాభార్జనే ధ్యేయంగా..

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అక్కరలేని పుస్త కాలు, అధిక ఫీజుల కు పాల్పడుతున్నా నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి. పుస్తకాల పేరిట రెట్టింపు దోపిడీ చేస్తున్నారు. పుస్తక రచయిత, శీర్షిక, ప్రచురణ సంవత్సరం, ఎడిషన్‌ వివరాలు లేకుండానే అమ్ముతున్నారు. లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.

– శంతన్‌ ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌

చర్యలు తీసుకుంటాం..

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను పాటించాలి. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, ఇతర బుక్స్‌ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.

– రమేశ్‌కుమార్‌, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement