ముక్కోటి.. దండాలు
రంగనాథస్వామి దేవాలయంలో పూజలో పాల్గొన్న భక్తులు
అలంకరణలో రంగనాథస్వామి
నమో శ్రీనివాసాయ.. నమో తిరుమలేశాయ.. వైకుంఠవాస గోవిందా.. అంటూ భక్తుల వేంకటేశ్వరస్వామి నామస్మరణతో వైష్ణవాలయాలు మార్మోగాయి. మంగళవారం
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ప్రధానంగా శ్రీపురంలోని శ్రీరంగనాథస్వామి, జిల్లాకేంద్రంలోని రామాలయం, హౌసింగ్‌బోర్డు కాలనీలోని
గోవిందక్షేత్ర నిలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లోనూ స్వామివారు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి
పట్టణాల్లోని పలు ఆలయాల్లో భక్తులు స్వామివార్లను
దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. – కందనూలు
శ్రీపురం రంగనాథస్వామి ఆలయంలో స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు
ముక్కోటి.. దండాలు


