సైన్స్‌తోనే సమాజాభివృద్ధి : డీఈఓ
కందనూలు: సైన్స్‌తోనే సమాజాభివృద్ధి జరుగుతుందని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్ మంగళవారం ముగిశాయి. ఈ ప్రదర్శనలో ఇన్‌స్పైర్ అవార్డుకు సంబంధించి 93 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. 17 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అలాగే జిల్లాస్థాయిలో ప్రతిభచాటిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర, సాంకేతిక అంశాలపై గ్రామీణ విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినప్పుడే సైన్స్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన అంశాలపై శ్రద్ధ చూపాలని, చివరగా అన్ని సబ్జెక్టుల్లో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్‌రావు, నోడల్ అధికారి కుర్మయ్య, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


