బిజినేపల్లి: మండలంలోని పాలెం అటానమస్ డిగ్రీ కళాశాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్‌లో 43 శాతం ఉత్తీర్ణత సాధించారని, విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. మార్కుల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 17 వరకు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలన్నారు. ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజ్‌కుమార్, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధరెడ్డి విడుదల చేయగా.. కళాశాల అడిషనల్ కంట్రోలర్ శివ, సిబ్బంది శ్రీనివాస్, నాగరాజు, సుష్మ, వెంకటేష్, యాదగిరి, కవిత తదితరులు పాల్గొన్నారు.
పాకిస్తాన్ వలసదారులను వెనక్కి పంపాలి
కందనూలు: జిల్లాలో అక్రమంగా నివశిస్తున్న పాకిస్తాన్ వలసదారులను వెనక్కి పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ దేవసహాయంకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనగర్ పర్యాటక స్థలం పహల్గాంలో పాకిస్తాన్ జిహాది ఉగ్రవాదులు అమాయక యాత్రికులను మతం గురించి అడిగి హిందువులను చంపారని, ఈ సంఘటన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇ
ప్పటికీ జిల్లాలో పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా నివశిస్తున్నారని, జిల్లావ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి వారిని గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించి ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ప్రమాదాన్ని నివారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్‌రెడ్డి, యువ మోర్చ జిల్లా కార్యదర్శి నరేష్‌చారి, పట్టణ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, నాయకులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ ఫలితాలు విడుదల


