కల్వకుర్తి మున్సిపాలిటీలో మూడేళ్ల క్రితం రూ. 5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 25శాతం పనులు కూడా పూర్తికాలేదు. మరోవైపు బస్టాండ్ సమీపంలో రూ. 55లక్షలతో వీధి వ్యాపారుల కోసం నిర్మించినా షెడ్ల కేటాయింపు జరగకపోవడంతో ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంత రోడ్లపైనే సాగుతోంది. సంతలో సరైన వసతులు లేక క్రయ, విక్రయదారులు అవస్థలు పడుతున్నారు.
త్వరగా నిర్మించాలి..
మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను త్వరగా పూర్తిచేసి కూరగాయల వ్యాపారంపైనే ఆధారపడిన మాలాంటి వారికి అందించాలి. గతంలో రోడ్లపై కూరగాయలు అమ్మవద్దని.. షెడ్లను ఏర్పాటు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు.
– శాంతమ్మ, తుర్కలపల్లి
సా..గుతున్న పనులు
సా..గుతున్న పనులు
సా..గుతున్న పనులు


