96 మిల్లులు.. 73,809 టన్నులు! | - | Sakshi
Sakshi News home page

96 మిల్లులు.. 73,809 టన్నులు!

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

స్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో కలకలంరేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో కోట్లాది రూపాయల విలువైన సర్కారు ధాన్యం కొందరు రైసుమిల్లర్ల జేబుల్లోకి వెళ్లింది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లింగ్‌ కోసం కేటాయించగా, వాటిని పక్కదారి పట్టించి ఆ డబ్బుతో కొందరు జల్సాలు చేస్తున్నారు. మరికొందరు బినామీ పేర్ల మీద బంగళాలు, కార్లు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సీఎంఆర్‌ ఎగవేసి తిరుగుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మంత్రులు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కఠిన నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం డిఫాల్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల్లో గుబులు మొదలైంది.

ఆరు జిల్లాల్లో రూ.166 కోట్లు..

మహబూబాబాద్‌లో అత్యధికం..

ఆరు జిల్లాలకు చెందిన కొందరు రైసుమిల్లర్లు గత వానాకాలం సీజన్‌ నాటికే రూ.348 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. 2022–23 రబీ సీజన్‌కు సంబంధించి ఆరు జిల్లాల్లో గురువారం నాటికి 96 రైస్‌మిల్లుల నుంచి 73,809 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విలువకు సమానమైన రూ.166.30 కోట్ల రికవరీ ఇంకా పెండింగ్‌లో ఉంది. బకాయిల్లో మహబూబాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరంగల్‌ జిల్లా ఉంది.

డిఫాల్టర్‌లకూ సీఎంఆర్‌..?..

ఇలాగైతే బాకీ తీరేదెప్పుడు?

2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ బకాయిలు ఇంతవరకు పూర్తిగా రికవరీ కాకపోవడం గమనార్హం. ఆ జాబితాలో ఉన్న కొందరికీ ఆ తర్వాత సీజన్‌లలో కూడా సీఎంఆర్‌ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే కోట్లాది రూపాయలు ఎగవేసిన మిల్లర్లను డిఫాల్టర్‌లుగా చూపకుండా ఎలా ఇస్తారు? అన్న చర్చ కొందరు రైసుమిల్లర్లలోనే సాగుతోంది. ఉన్నతాధికారులు అడిగినప్పుడు బకాయిల వివరాలే చూపుతున్న స్థానిక అధికారులు.. డిఫాల్టర్ల జాబితా, సీఎంఆర్‌ కేటాయింపులు గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్‌ రెడ్డి తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికై నా బకాయి ఉన్న 96 మిల్లుల నుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిస్థాయిలో రికవరీ చేయాల్సి ఉంది.

ధాన్యం (మెట్రిక్‌ టన్నులు)

మొత్తం మిల్లులు

చెల్లించిన

మిల్లులు

ఇప్పటికీ సరఫరా అయినది

(మె.టన్నులు)

బకాయి ధాన్యం

(మె.టన్నులు)

సీఎంఆర్‌ ఇచ్చిన ధాన్యం

(మె.టన్నులు)

ఉమ్మడి వరంగల్‌లో సీఎంఆర్‌ బకాయి లెక్క ఇదీ..

సీఎంఆర్‌ బకాయిల కొండ...

ఆరు జిల్లాల్లో రూ.348 కోట్లపైనే

2022–23 రబీ సీజన్‌ బకాయిలే భారీగా.. మహబూబాబాద్‌లో అత్యధికం

ఆ తర్వాత వరంగల్‌, హనుమకొండ జిల్లాలు...

రైస్‌మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపై సీరియస్‌గా ఉండాలి. భవిష్యత్‌లో వారికి సీఎంఆర్‌ ఇవ్వొద్దు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, సీఎంఆర్‌ అప్పగించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. బకాయిలపై పక్కా లెక్కలు తేల్చాలి. బకాయిదారులనుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిగా రికవరీ చేయని వారిపై చర్యలు ఉంటాయి.

సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి

1,11,634

బకాయి

73,809

37,825

216

120

(55.56%)

జిల్లా సీఎంఆర్‌గా మొత్తం బకాయి బకాయి బకాయి

ఇచ్చిన ధాన్యం మిల్లులు ధాన్యం మిల్లులు విలువ

(మె.టన్నులు) (మె.టన్నులు) (రూ.కోట్లలో..)

హనుమకొండ 13,015 34 8,683 12 19.42

వరంగల్‌ 32,425 67 21,512 27 48.54

జనగామ 4,429 45 3,258 27 7.49

జేఎస్‌ భూపాలపల్లి 15,900 20 4,204 5 9.59

మహబూబాబాద్‌ 40,758 25 33,309 12 74.90

ములుగు 5,107 25 2,843 13 6.36

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement