నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు

ములుగు రూరల్‌: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు గురువారం వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. పీహెచ్‌సీల్లో నెలవారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ ఇంటిని సర్వే చేసి దోమల లార్వా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 14ఏళ్లు నిండిన విద్యార్థులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలలో గర్భిణుల వివరాలు 12 వారాల్లోపు నమోదు చేయాలన్నారు. రక్తహీనత ఉన్న వారికి ఐరన్‌ పాలిక్‌ మాత్రలను అందించాలని తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతి, ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీకాంత్‌, రవితేజ, నాగఅన్వేష్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌, దుర్గారావు, వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement