నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

ఏటూరునాగారం: వేటగాళ్ల విద్యుత్‌ ఉచ్చులకు బలైన నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏటూరునాగారం సౌత్‌ రేంజ్‌ అధికారి అబ్ధుల్‌ రెహమాన్‌, నార్త్‌ ఎఫ్‌ఆర్‌ఓ అశోక్‌, ఎస్‌ఎస్‌తాడ్వాయి ఎఫ్‌ఆర్‌ఓ రమేశ్‌లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో ముందుగా విద్యుత్‌ ఉచ్చులకు బలైన అధికారి నవీన్‌ మృతికి నివాళులర్పించారు. అనంతరం వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏటూరునాగారం డివిజన్‌లో పరిధిలోని అటవీశాఖ అధికారులు అటవీశాఖ కార్యాలయం నుంచి కూరగాయల మార్కెట్‌ వరకు బైక్‌ ర్యాలీ, నిరసనలు చేపట్టారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఎఫ్‌ఆర్‌ఓలు మాట్లాడుతూ బూర్గంపాడు మండలం నకిరిపేట సమీపంలో గల అడవిలో జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉచ్చు తగిలి చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నవీన్‌ చనిపోయారని తెలిపారు. అతని మరణానికి కారణమైన వేటగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏటూరునాగారం, వెంకటాపురం డివిజన్‌ జూనియర్‌ ఫారెస్టు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేందర్‌, మంగపేట ఇన్‌చార్జ్‌ హుస్సేన్‌, జూనియర్‌ ఫారెస్టు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు నారాయణ, శేషు, ఏటూరునాగారం దక్షిణం, ఏటూరునాగారం ఉత్తరం, తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు, దూలపురం రేంజ్‌లకు చెందిన డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓలు, సెక్షన్‌, బీట్‌ ఆఫీసర్లు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement