మెకానిక్‌ డేట్‌ చేంజ్‌ | Vishwak Sen Mechanic Rocky Gets a New Release Date | Sakshi
Sakshi News home page

మెకానిక్‌ డేట్‌ చేంజ్‌

Oct 15 2024 1:51 AM | Updated on Oct 15 2024 1:51 AM

Vishwak Sen Mechanic Rocky Gets a New Release Date

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘మెకానిక్‌ రాకీ’ సినిమా విడుదల తేదీ మారింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే నవంబరు 22న రిలీజ్‌ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్‌. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మించారు.

ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 20న, సినిమాని నవంబరు 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘మోస్ట్‌ ఎవైటెడ్‌ మాస్‌ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘మెకానిక్‌ రాకీ’ రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి, రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని యూనిట్‌ పేర్కొంది. వీకే నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్‌ నటించిన ఈ సినిమాకి కెమెరా: మనోజ్‌ కాటసాని, సంగీతం: జేక్స్‌ బిజోయ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్స్‌: ‘సత్యం’ రాజేష్, విద్యాసాగర్‌ జె.

Advertisement
 
Advertisement
Advertisement