ఎనిమిది మంది పనిని ఒక్కడే చేస్తుంటాడు: విశ్వక్‌ సేన్‌ | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది పనిని ఒక్కడే చేస్తుంటాడు: విశ్వక్‌ సేన్‌

Published Mon, May 27 2024 12:28 AM

Vishwak Sen about Parakramam movie trailer

‘‘పరాక్రమం’ సినిమా ట్రైలర్‌ బాగుంది. నేను యానిమేషన్, ఎడిటింగ్‌ కోర్సులు చేస్తున్నప్పటి నుంచి మా సర్కిల్స్‌లో బండి సరోజ్‌ కుమార్‌ పేరు వింటున్నాను. ఆయన ఎనిమిది మంది పనిని ఒక్కడే  చేస్తుంటాడు. ఈ సినిమా సరోజ్‌ కుమార్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. బండి సరోజ్‌ కుమార్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘పరాక్రమం’. శ్రుతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్‌ సేనాపతి, నిఖిల్‌ గోపు, అనిల్‌ కుమార్‌ ఇతర పాత్రల్లో నటించారు.

బీఎస్‌కే మెయిన్‌ స్ట్రీమ్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి విశ్వక్‌ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్‌ ద్వారక తదితరులు అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు మాట్లాడుతూ– ‘‘కన్నడ పరిశ్రమలో ఉపేంద్రగారు అన్ని ముఖ్యమైన విభాగాలు ఆయనే చేసుకుంటారు. అలా తెలుగులో సరోజ్‌ కుమార్‌ ఉన్నారు’’ అన్నారు. ‘‘నేను 2004లో జూనియర్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. పలు చిత్రాలు చేశా. ‘పరాక్రమం’ అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది’’ అన్నారు బండి సరోజ్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement