ఈ ఏడాది నాకు చాలా స్పెషల్‌: విశ్వక్‌సేన్ | Vishwak Sen About His New Movie Mechanic Rocky | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది నాకు చాలా స్పెషల్‌: విశ్వక్‌సేన్

Jul 29 2024 6:01 AM | Updated on Jul 29 2024 6:01 AM

Vishwak Sen About His New Movie Mechanic Rocky

‘‘ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. నేను నటించిన మూడో సినిమా (మెకానిక్‌ రాకీ) కూడా రిలీజ్‌ అవుతోంది. (‘గామి, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రాలు విడుదలయ్యాయి). మలక్‌పేట బ్యాక్‌డ్రాప్‌లో సాగే  ముక్కోణపు ప్రేమకథే ‘మెకానిక్‌ రాకీ’. రాకీగా నాపాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరో విశ్వక్‌సేన్‌ అన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. విశ్వక్‌సేన్  హీరోగా, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్‌ కానుంది.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ వీడియో లాంచ్‌ ఈవెంట్‌లో విశ్వక్‌సేన్  మాట్లాడుతూ–‘‘ఈ సినిమా దీపావళికి క్రాకర్‌ అవుతుంది. ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్‌లో చూడండి. రామ్‌ తాళ్లూరిగారి వల్లే ఈ సినిమా అవుట్‌పుట్‌ ఇంత బాగా వచ్చింది. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అదిరి΄ోతుంది’’ అన్నారు. ‘‘రొమాంటిక్‌ కామెడీ యాక్షన్  థ్రిల్లర్‌గా ‘మెకానిక్‌ రాకీ’ రూపొందింది. నాకు అవకాశం వచ్చిన విశ్వక్, రామ్‌ తాళ్లూరి గారికి థ్యాంక్స్‌’’ అన్నారు రవితేజ ముళ్లపూడి. ‘‘మెకానిక్‌ రాకీ’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు రామ్‌తాళ్లూరి, మీనాక్షీ చౌదరి.

Advertisement
 
Advertisement
Advertisement