మార్క్‌ ఆంటోని ట్విటర్‌ రివ్యూ.. విశాల్‌ సినిమాకు హిట్‌ టాక్‌! | Vishal's 'Mark Antony' Movie Twitter Review In Telugu | Sakshi
Sakshi News home page

Mark Antony Movie: మార్క్‌ ఆంటోని మూవీ ట్విటర్‌ రివ్యూ.. విశాల్‌ హిట్‌ కొట్టాడా?

Sep 15 2023 10:30 AM | Updated on Sep 15 2023 1:15 PM

Vishal Mark Antony Movie Twitter Review In Telugu - Sakshi

ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ అదిరిపోయిందని.. ఈ సినిమాతో విశాల్‌ సూపర్‌ హిట్‌ కొట్టాడని ట్వీ‍ట్‌ చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం సినిమా మరీ ఓ రేంజ్‌లో ఏమీ లేదని

హీరో విశాల్‌ నటించిన మార్క్‌ ఆంటోని సినిమా ఎన్నో అడ్డంకులను దాటి నేడు(సెప్టెంబర్‌ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినయ, రీతూ వర్మ కథానాయికలుగా నటించగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు.  ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించాడు. ఈ మధ్యే జైలర్‌ సినిమాలో కామెడీ రోల్‌తో మెప్పించిన సునీల్‌ ఈ చిత్రంలోనూ కీ రోల్‌లో యాక్ట్‌ చేశాడు. చాలా చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలు పడటంతో సినీప్రియులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఈ సినిమాలోని పాత్రలన్నీ కార్తీ వాయిస్‌తో ఇంట్రడ్యూస్‌ అయ్యాయట. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కామెడీ, యాక్టింగ్‌ అదిరిపోయిందని టాక్‌. ఒంటిచేత్తో సినిమాను నడిపించేశాడని ట్విటర్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రారంభంలో, ముగింపులో.. దళపతి విజయ్‌కు, తలా అజిత్‌కు థ్యాంక్స్‌ కార్డ్‌ వేశారట.. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ అదిరిపోయిందని.. ఈ సినిమాతో విశాల్‌ సూపర్‌ హిట్‌ కొట్టాడని ట్వీ‍ట్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌, క్లబ్‌ సీక్వెన్స్‌, సిల్కు సీన్‌, క్లైమాక్స్‌లో ఫన్‌.. నెక్స్ట్‌ లెవల్‌లో ఉన్నాయంటున్నారు. సునీల్‌కు  మరోవైపు కొందరు మాత్రం సినిమా మరీ ఓ రేంజ్‌లో ఏమీ లేదని ఒకసారి మాత్రం చూడవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే సునీల్‌ ఈ మధ్యే కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మావీరన్‌ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. జైలర్‌తో మరోసారి ప్రేక్షకులకు టచ్‌లోకి వచ్చాడు. తమిళ సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చాడో, లేదో అప్పుడే అక్కడి నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సునీల్‌ చేతిలో ఈగై, బుల్లెట్‌, జపాన్‌ సహా పలు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో గుంటూరు కారం, పుష్ప 2, గేమ్‌ చేంజర్‌ సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్‌ బ్యాచ్‌ అవుట్‌.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement