‘కల్యాణం కమనీయం జీవితం’.. మంచి ప్రయత్నం : విజయేంద్ర ప్రసాద్‌ | Vijayendra Prasad Released Kalyanam Kamaneeyam Jeevitham Movie Poster | Sakshi
Sakshi News home page

‘కల్యాణం కమనీయం జీవితం’.. మంచి ప్రయత్నం : విజయేంద్ర ప్రసాద్‌

Jun 28 2026 2:41 PM | Updated on Jun 28 2026 2:58 PM

Vijayendra Prasad Released Kalyanam Kamaneeyam Jeevitham Movie Poster

ఖాన్ దురాని, సాహితీ అవంచ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్యాణం కమనీయం జీవితం’. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న  ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..‘టైటిల్ చాలా బాగుంది. రాజవంశీ టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ మంచి ప్రయత్నం చేశారు .డైరెక్టర్ విజన్ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. హీరో హీరోయిన్ లకు, సినిమా టీమ్ కు అల్ ది బెస్ట్ అని అన్నారు

నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ .. ‘విజయేంద్ర ప్రసాద్ గారు అడగగానే మా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది ఆయనకు నా కృతజ్ఞతలు. డైరెక్టర్ కథ చెప్పగానే తప్పకుండా ఈ సినిమా చేయాలి అనిపించింది. దర్శకుడు చెప్పిన విధంగా సినిమా తీశాడు సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు

మరో నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ గారు పోస్టర్ ను ఆవిష్కరించి టీమ్ కు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మంచి కథ, కథనాలతో సినిమాని తెరకెక్కించాము త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము అన్నారు

దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ: విజయేంద్ర ప్రసాద్ గారు మా పోస్టర్ ని ఆవిష్కరించడంతో నే మా సినిమా సక్సెస్ అయినంత ఆనందంగా వుంది. నిర్మాతలు నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు వారి కృతజ్ఞతలు. ప్రేమ సస్పెన్స్ కలయికతో ఒక ఉత్కంఠ భరితంగా సినిమా వుంటుంది.అలాగే మా టీమ్ అంతా కలిసి ఒక మంచి ప్రయత్నం చేసాము ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement