హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే? | Vijay Sethupathi Son Surya Sethupathi latest Movie Song out Now | Sakshi
Sakshi News home page

Surya Sethupathi: హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Jun 27 2025 4:11 PM | Updated on Jun 27 2025 4:36 PM

Vijay Sethupathi Son Surya Sethupathi latest Movie Song out Now

విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్‌’. స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే బ్రేవ్‌మ్యాన్‌ పిక్చర్స్‌ నిర్మించారు. ఫీనిక్స్ మూవీలో అభిన‌క్ష‌త్ర‌, వ‌ర్ష హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా... వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, సంప‌త్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలోని ఇందా వాంగికో...(ఇదిగో తీసుకో అని అర్థం) అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు.  గతంలో నానుమ్‌ రౌడీదాన్, సిందుబాద్‌’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్, చక్కని ఎమోషన్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement