Vijay Sethupathi drops poster of his 50th film titled 'Maharaja' - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: అర్ధ సెంచరీ టచ్‌ చేసిన విజయ్‌ సేతుపతి!

Jul 13 2023 11:55 AM | Updated on Jul 13 2023 12:07 PM

Vijay Sethupathi Drops His 50th Film Poster - Sakshi

అర్ధ సెంచరీని టచ్‌ చేశారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషల్లో నటిస్తూ ఇండియన్‌ సినీ నటుడిగా

బహుభాషా నటుడు విజయ్‌ సేతుపతి ఇప్పుడు అర్ధ సెంచరీని టచ్‌ చేశారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషల్లో నటిస్తూ ఇండియన్‌ సినీ నటుడిగా పేరు గడించిన విజయ్‌సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రానికి మహరాజా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీన్ని ఫ్యాషన్‌ స్టూడియోస్‌, సుదన్‌ సుందరం సంస్థలు నిర్మిస్తున్నాయి.

పాన్‌ ఇండియన్‌ చిత్రంగా రూపొందుతున్న ఇందులో బాలీవుడ్‌ నటుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి మమతా మోహన్‌దాస్‌, నట్టి నటరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కాగా నటి మమతామోహన్‌దాస్‌ చాలా గ్యాప్‌ తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది.

దీనికి అజినీష్‌ లోక్‌నాథ్‌ సంగీతాన్ని, ధినేశ్‌ పురుషోత్తమన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని నిర్మాతలు తెలిపారు. చిత్ర ట్రైలర్‌, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్‌సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం కావడంతో మహారాజాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చదవండి: ఎక్కువమంది చూసిన ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ ఏదో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement