విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల పెళ్లయి ముచ్చటగా మూడు నెలలైంది. అయితే ఈ ఇద్దరూ పెళ్లయిన తర్వాత జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకుని, షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. ఇక ఈ ఇద్దరూ జంటగా సిల్వర్ స్క్రీన్‌పై ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా ‘రణబాలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తోనే విజయ్–రష్మిక బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం షూటింగ్ వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో జరుగుతోంది. కోట ముఖద్వారం దగ్గర, ధాన్యాగారంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఆదివారం గండికోటలో ఆరంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో ముగుస్తుందని సమాచారం. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది.
ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ స్టాలియన్ అనే బ్రీడ్‌కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం నేర్చుకున్నారు. ‘‘ఇది చాలా కఠినమైన ట్రైనింగ్. స్టాలియన్ బ్రీడ్ గుర్రాలను స్వారీ చేయడం అంత ఈజీ కాదు’’ అని ఆ మధ్య విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా యూనిట్ పేర్కొంది. చిత్రబృందం పేర్కొన్నట్లే... విజయ్ చాలా ప్రయత్నాలు చేసి, సక్సెస్‌ఫుల్‌గా హార్స్ రైడింగ్ చేయడం ఆ గ్లింప్స్‌లో కనిపించింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ – అతుల్, కెమెరా: నీరవ్ షా.


