
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్‌లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు.
Puttaparthi ❤️🙏
Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025