John Paul Puthussery: వెటరన్‌ స్క్రీన్‌ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Veteran Screenwriter John Paul Puthussery Passed Away At 72 - Sakshi

Veteran Screenwriter John Paul Puthussery Passed Away At 72: ప్రముఖ బహుముఖ కథా రచయతి జాన్‌ పాల్‌ పుతుస్సేరి కన్నుమూశారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. 72 ఏళ్ల జాన్‌ పాల్‌ గత రెండు నెలలుగా చికిత్స తీసుకుంటూ శనివారం (ఏప్రిల్‌ 23) మరణించారు. జాన్‌ పాల్‌ మృతిపట్ల కేరళ విద్యాశాఖ మంత్రి శివన కుట్టి సంతాపం వ్యక్తం చేశారు. మలయాళం ఇండస్ట్రీలో వెటరన్‌ స్క్రీన్‌ రైటర్‌గా పేరొందిన జాన్ పాల్ సుమారు 100కుపైగా సినిమాలకు పనిచేశారు. 

1980లో స్టార్‌ డైరెక్టర్‌ భరతన్‌ దర్శకత్వం వహించిన 'చమరం' సినిమాతో జాన్‌ పాల్‌ స్క్రీన్‌ ప్లే రైటర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. తర్వాత పాలంగల్‌, ఓరు మిన్నమినుంగింటే నురుంగు వెట్టం, యాత్రా వంటి క్లాసిక్‌ చిత్రాలకు స్క్రీన్‌ ప్లే అందించారు. డ్రామా, కామెడీ, యాక్షన్‌ థ్రిల్లర్ వంటి వివిద రకాల జోనర్‌లకు ఆయన పనిచేశారు. బాలు మహేంద్ర, జోషి, శశి, సేతు మాధవన్ వంటి తదితర డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. శశి దర్శకత్వం వహించిన వెల్లతూవల్‌ (2009) సినిమా తర్వాత 10 ఏళ్లు కేరీర్‌ పరంగా సుధీర్ఘ విరామం తీసుకున్నారు. మళ్లీ 2019లో కమల్ డైరెక్ట్‌ చేసిన ప్రణయామీనుకలుడే కాదల్‌ సినిమాకు స్క్రిప్ట్‌ రాయడంతో రీఎంట్రీ ఇచ్చారు. 

చదవండి: ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్‌.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్‌..

ఓటీటీలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైంపాస్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top