వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల | Varun Sandesh Viraaji Movie First Look | Sakshi
Sakshi News home page

వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Jul 11 2024 2:14 PM | Updated on Jul 11 2024 2:14 PM

Varun Sandesh Viraaji Movie First Look

టాలీవుడ్‌ హీరో  వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.

విరాజి టీజర్‌ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్‌ను దర్శకుడు సాయి రాజేష్  అభినందించారు. టీజర్‌ చాలా బాగుందని, విజువల్స్‌ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్‌ సందేశ్‌ లుక్‌ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు  దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు.  

మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్‌అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్  విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement