పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్ | Actress Varalaxmi Sarathkumar Interesting Comments About Husband Nicholai Sachdev, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: నా కోసం ఆయనే షిఫ్ట్ అవుతున్నారు: వరలక్ష్మి శరత్ కుమార్

Jan 31 2025 2:55 PM | Updated on Jan 31 2025 4:08 PM

 Varalaxmi Sarathkumar Open About Husband Nicholai Sachdev

దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మదగజరాజా. ఈ చిత్రంలో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్రం జనవరి 31  తెలుగులో విడుదలైంది.  ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేంటో తెలుసుకుందాం.

గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తన కోసం పూర్తిగా మారిపోయాడని తెలిపింది. నా కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారని పేర్కొంది. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారని వెల్లడించింది. నా కోసం ఆయన తన లైఫ్ స్టైల్‌ పూర్తిగా మార్చుకున్నారని వివరించింది.

ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ..'నికోలయ్‌తో పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు. నాకోసం అతని జీవితాన్నే పూర్తిగా మార్చుకున్నాడు. నా కోసం ఆయనే హైదరాబాద్‌ షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు తన పేరును నికోలయ్‌ సచ్‌దేవ్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నారు. నా కెరీర్‌ పరంగా ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్‌ కాదనుకునేదాన్ని. కానీ నికోలయ్‌తో  పరిచయం తర్వాత నా జీవితానికి అతనే సరైన భాగస్వామి అని అర్థమైంది. అలా పెద్దల అంగీకారంతో వివాహాబంధంలోకి అడుగుపెట్టాం' అని చెప్పింది. 

సినిమాల విషయానికొస్తే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీలోనూ కీలకపాత్ర పోషించింది.

Advertisement
 
Advertisement
Advertisement