సీరత్ కపూర్‌కు గోల్డెన్ ఛాన్స్‌ దక్కనుందా..? | Trivikram Offer Movie Chance To Seerat Kapoor | Sakshi
Sakshi News home page

సీరత్ కపూర్‌కు గోల్డెన్ ఛాన్స్‌ దక్కనుందా..?

Jul 20 2024 5:27 PM | Updated on Jul 20 2024 6:53 PM

Trivikram Offer Movie Chance To Seerat Kapoor

టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన  డైరెక్టర్‌గా  కె. విజ‌య భాస్క‌ర్ గుర్తింపు పొందారు. త్రివిక్రమ్‌ కూడా తన సినీ కెరీర్‌ ప్రారంభంలో విజయ్‌ భాస్కర్‌ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఇండిస్ట్రీలో మంచి హిట్‌ సినిమాలను నిర్మించారు. అయితే, కొంత కాలం తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్టర్‌గా తనే పలు సినిమాలు తెరకెక్కించి టాప్‌ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో విజయ్‌ భాస్కర్‌, త్రివిక్రమ్‌ మధ్య పలు విభేదాలు వచ్చాయని రూమర్స్‌ వచ్చాయి.  కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ కలిసి 'ఉషా ప‌రిణ‌యం' సినిమా సెట్‌లో కలిశారు. దీంతో ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు.  అయితే, తాజాగా అదే ఫోటోను సీర‌త్‌ క‌పూర్‌ తన సోషల్‌మీడియాలో పంచుకుంది.

విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో 'ఉషా ప‌రిణ‌యం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన త‌న‌యుడు శ్రీ‌ క‌మ‌ల్ హీరోగా న‌టిస్తున్నారు. శ్రీ కమల్‌కు జోడీగా తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌ తెలుగ‌మ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది.  ఈ సినిమాలో ఒక ఐటమ్‌ సాంగ్‌లో సీరత్‌ కపూర్‌ దుమ్మురేపింది. ఆ పాట షూటింగ్‌ చివరి రోజులో సెట్స్‌లో త్రివిక్రమ్‌ కూడా సందడి చేశారు. ఆ సమయంలో ఆయనతో సీరత్‌ కపూర్‌ ఫోటోలు దిగింది. వాటిని ఇప్పుడు తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నాటి విషయాలను పంచుకుంది.

ఉషా పరిణయం సినిమా సెట్స్‌లో సాంగ్‌ చిత్రీకరణ జరుగుతుండగా త్రివిక్రమ్‌ సార్‌ వచ్చారు.  మానిటర్ దగ్గర కూర్చొని నా క్లోజ్ అప్ షాట్‌ని చాలా తీక్షణంగా గమనించారు. ఆప్పుడు నాకు ఆ విషయం తెలియదు. షూట్‌ పూర్తి అయిన తర్వాత ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఈ సాంగ్‌ కోసం చాలా కష్టపడ్డాం. అందుకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవన్నీ దర్శకులు విజయ భాస్కర్‌కు దక్కుతాయి.' అని ఆమె తెలిపింది. అయితే, తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

సీరత్‌ కపూర్‌ టాలెంట్‌కు ఫిదా అయిన త్రివిక్రమ్‌ ఆమెకు సినిమా ఛాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ తర్వాతి సినిమాలో సీరత్‌ కపూర్‌తో ఐటమ్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు నెట్టింట వార్త వైరల్‌ అవుతుంది. త్రివిక్రమ్‌ సినిమాలో ఆమె ఒక్కసారి మెరిస్తే మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాల బాట పట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సీరత్ కపూర్‌ నటించిన  ఉషా పరిణయం సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement