ది ట్రయల్‌ భార్యాభర్తల కథ | The Trial Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

ది ట్రయల్‌ భార్యాభర్తల కథ

May 25 2023 4:33 AM | Updated on May 25 2023 6:58 AM

The Trial Movie Teaser Launch - Sakshi

యుగ్‌ రామ్, వంశీ కోటు హీరోలుగా, స్పందన పల్లి హీరోయిన్‌గా రామ్‌ గన్నీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ట్రయల్‌’. ఎస్‌ఎస్‌ ఫిల్మ్స్, కామన్‌ మేన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై స్మృతి సాగి, శ్రీనివాస్‌ కె. నాయుడు నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ను ‘పుష్ప’ చిత్ర రచయిత శ్రీకాంత్‌ విస్సా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘పలాస’ హీరో రక్షిత్‌ అట్లూరి విడుదల చేశారు.

రామ్‌ గన్నీ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్‌ కథతో రూపొందుతోన్న చిత్రం ‘ది ట్రయల్‌’. ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ ఈ కథ జరుగుతుంది’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ చాలా కష్టపడి ఈ మూవీ చేశాం’’ అన్నారు యుగ్‌ రామ్‌.

‘‘ది ట్రయల్‌’ థ్రిల్లర్‌ సినిమా అయినా చాలా వినోదం ఉంటుంది’’ అన్నారు స్పందన పల్లి. ‘‘ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు సతీష్‌ వర్మ. ‘‘సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఎస్‌ఐ జాబ్‌ని వదులుకుని మరీ వచ్చి ఈ సినిమాని డైరెక్షన్‌ చేశారు రామ్‌ గన్నిగారు’’ అన్నారు వంశీ కోటు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహ నిర్మాతలు: సుదర్శన్‌ రెడ్డి, కంచరన జయలక్ష్మి. 

Advertisement
 
Advertisement
Advertisement