'వ్యూహం' చిత్రం విడుదలపై రేపు విచారణ | Sakshi
Sakshi News home page

'వ్యూహం' చిత్రం విడుదలపై రేపు విచారణ

Published Mon, Jan 29 2024 1:54 PM

Tomorrow Hearing On The Release Of The Film Vyooham - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు చేపడతామని కోర్టు తెలిపింది. వ్యూహం చిత్రం విడుదల అంశంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్‌ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు పలు రికార్డ్స్‌ను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డ్స్‌ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపిన విషయం తెలిసిందే. విడుదల విషయంలో జాప్యం జరిగితే  భారీ నష్టం వస్తుందని వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే.

వ్యూహం చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్‌ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలువరించింది.

Advertisement
 
Advertisement