ప్రభాస్ కోసం రాసుకున్న కథే కన్నప్ప: మోహన్‌ బాబు ఆసక్తికర కామెంట్స్‌ | Tollywood Star Actor Mohan Babu Interesting Comments On Kannappa Movie | Sakshi
Sakshi News home page

Mohan Babu: అడగ్గానే కథను మాకు ఇచ్చేశారు: మోహన్‌ బాబు

Published Fri, Jun 14 2024 6:42 PM | Last Updated on Fri, Jun 14 2024 6:56 PM

Tollywood Star Actor Mohan Babu Interesting Comments On Kannappa Movie

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్‌ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. 'కన్నప్ప సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసలతో కన్నప్పను నిర్మించాం. దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజుతో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను  కృష్ణంరాజు మాకు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్‌లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement