9 నెలల తర్వాత ఓటీటీకి టాలీవుడ్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Movie Ott Streaming Form Today On This Ott | Sakshi
Sakshi News home page

Tollywood Thriller Movie: ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Nov 28 2024 8:49 AM | Updated on Nov 28 2024 3:52 PM

Tollywood Movie Ott Streaming Form Today On This Ott

ఇప్పుడు తాజా ట్రెండ్‌ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్‌తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి.  ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.

అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్‌లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్‌ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు  వివేక్ రామస్వామి సంగీతమందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement