కల్కి సినిమా చూసి థ్రిల్ అ‍య్యా: టాలీవుడ్ హీరోయిన్! | Tollywood Heroine Raasi Praises Kalki 2898 AD Movie | Sakshi
Sakshi News home page

Raasi: కల్కి చూసి నా కూతురు థ్రిల్‌గా ఫీలైంది: హీరోయిన్ రాశి

Jul 21 2024 4:26 PM | Updated on Jul 21 2024 4:41 PM

Tollywood Heroine Raasi Praises Kalki 2898 AD Movie

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో సినీ ప్రముఖులు సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా కల్కి సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ రాశి ప్రశంసలు కురిపించారు. కల్కి మూవీ అద్భుతంగా ఉందని ఆమె కొనియాడారు. చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని అన్నారు. తన కూతురితో కలిసి వెళ్లి కల్కి సినిమా చూశానని వెల్లడించారు. 3డీ అద్దాల్లో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేశామని.. ఈ మూవీని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని తెలిపింది. కాగా.. రాశి టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన సినిమాల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement