మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్‌.. ఆసక్తిగా పోస్టర్‌! | Sakshi
Sakshi News home page

Sree Vishnu: ఆ ముగ్గురి కాంబోలో మరో చిత్రం.. టైటిల్‌తోనే నవ్వించారు!

Published Thu, Feb 22 2024 12:16 PM

Tollywood Hero Sri Vishnu Latest Movie Title and First Look Poster Viral - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది  సామజవరగమన మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్‌ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్‌ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్‌ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. 

కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement