కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'మిత్ర మండలి' టీజర్‌ | Mithra Mandali Teaser Out Now | Sakshi
Sakshi News home page

కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'మిత్ర మండలి' టీజర్‌

Jun 12 2025 1:59 PM | Updated on Jun 12 2025 1:59 PM

Mithra Mandali Teaser Out Now

ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్‌ఎమ్‌ (Niharika NM) జోడీగా నటిస్తున్న కొత్త చిత్రం 'మిత్ర మండలి'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీని విజయేందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో  'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పిస్తుండగా కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప్‌, విజేందర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందర్నీ నవ్వించేలా టీజర్‌ ఉంది.

సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక ఎన్‌ఎమ్‌ .. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement