
బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం సాహ్ని (Marina Abraham Sahni) గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మెరీనా- రోహిత్ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నటికి డెలివరీ అయి చాలారోజులే అవుతున్నప్పటికీ కొంతకాలంగా గోప్యంగా ఉంచింది. నేడు (ఆగస్టు 16న) శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కూతురు పుట్టిందని చెప్తూ తన ఫోటోను షోర్ చేసింది. పాపకు 'తెయారా సాహ్ని' అని నామకరణం చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. మెరీనా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రెగ్నెన్సీ జర్నీ
మెరీనా 2021లో తొలిసారి ప్రెగ్నెంట్ అయింది. కానీ ఫస్ట్ స్కానింగ్‌లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్‌బీట్ వస్తుందేమోనని మూడునెలలవరకు కడుపులో శిశువును అలాగే మోసింది. డాక్టర్లు హెచ్చరించడంతో చివరకు దాన్ని తీసేయించుకుంది. 2022లో మరోసారి గర్భం దాల్చింది. అది కూడా మిస్‌క్యారేజ్ అయింది. ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రేమ పెళ్లి
మెరీనా పుట్టిపెరిగిందంతా గోవాలోనే! మెరీనా పదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె తల్లికి హైదరాబాద్‌లో స్కూల్ ప్రిన్సిపల్‌గా ఛాన్స్ వచ్చింది. అలా తను ఇక్కడే సెటిలైంది. మోడలింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్‌లో, సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అమెరికా అమ్మాయి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మెరీనా అబ్రహం. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి ధారావాహికల్లోనూ నటించింది. ఓ సినిమా టైంలో పరిచయమైన రోహిత్ (Rohit Sahni)తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు. మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్.. టాప్ 5లో స్థానం సంపాదించుకున్నాడు.