ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది? | Is Tollywood Hero Akkineni Akhil Agent Movie OTT Release Again Postponed? Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Agent Movie OTT Release: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?

Jul 9 2024 2:09 PM | Updated on Jul 10 2024 4:33 PM

tollywood Hero Akkineni Akhil Movie Agent Streaming Postponed

అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్‌ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్‌ చేసినప్పటికీ స్ట్రీమింగ్‌కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్‌ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement