టాలీవుడ్కు ఆణిముత్యంలా దొరికిన కమెడియన్ సత్య. అతని కామెడీ టైమింగ్ చూసి మరో బ్రహ్మనందం దొరికాడంటూ ఇప్పటికే ప్రశంసలొచ్చాయి. అటు నటుడిగా.. ఇటు కమెడియన్గా టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మత్తు వదలరా మూవీలతో సత్య తానేంటో నిరూపించుకున్నాడు. తెలుగు సినిమా కామెడీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు.
తాజాగా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే చిత్రాలను తెరెకెక్కించిన రితేశ్ రాణానే సత్యను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు సత్య ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రాకి జెట్లీ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా సత్య ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.
#RR4 is #JETLEE ❤🔥
̶C̶o̶m̶e̶d̶i̶a̶n̶ ̶S̶a̶t̶y̶a̶ ̶ HERO #Satya in and not as #JETLEE ❤🔥
A @RiteshRana's turbulence 🛫
Entertainment takes off. Shoot begins 💥💥
Starring #Satya, #RheaSingha, @vennelakishore
Music by @kaalabhairava7
Produced by @ClapEntrtmnt
Presented… pic.twitter.com/X99IRAAEVt— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2025


