
వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజులుగా చర్చలు జరిగినా.. ఫలితం లేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుంటే.. పెంచనిదే పనికి వెళ్లమని కార్మికులు అంటున్నారు. నాలుగో రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ రోజు ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.
చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్‌డీసీ చెర్మెన్, నిర్మాత దిల్ రాజు నుఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలవబోతున్నారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి తమ సమస్యలు వివరిస్తామని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. చిరంజీవి నిర్ణయానికి తాము కూడా కట్టుబడి ఉంటామని చెప్పారు.
సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే
రెండు ప్రధాన డిమాండ్స్‌తో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. వాటిలో ఒకటి కార్మికుల వేతనాలు పెంచాలి. రెండోది పెంచిన వేతనాలు ఏరోజుకారోజే ఇవ్వాలి. నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని సమ్మె విరమణపై ఆలోచిస్తామని ఫెడరేషన్ నాయకులు చెప్పారు. పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అని అన్నారు