breaking news
Telugu cine workers
-
సమ్మెలో సినీ కార్మికులు.. నిర్మాతల నుంచి 4 షరతులు
చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ఆందోళనకి తెరపడేలా కనిపించడం లేదు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య చర్చలకు నేడు (ఆగష్టు 8) విరామం ఇచ్చారు. నాలుగురోజుల నుంచి వారు సమ్మెలో ఉండటంతో టాలీవుడ్ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతలలు 4 ప్రతిపాదనలు ఉంచారు. వాటికి అంగీకారం తెలిపితే వారు కోరిని 30 శాతం జీతం పెంపు అనే అంశంపై ఒక క్లారిటీ రావచ్చు. జీతాల పెంపు అంశంపై మంత్రి కోమటి రెడ్డి , చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. శనివారం జరగబోయే చర్చలు సానుకూలంగా రాణి పక్షంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ కార్మికులు చెప్పుకొస్తున్నారు.నిర్మాతల 4 ప్రతిపాదనలు ఇవేకార్మికులు ఖచ్చితమైన కాల్ షీట్లు ఇవ్వాలి. పని గంటల విషయంలో (6Am to 6Pm, 9Am to 9Pm ) ఏదొ ఒక షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలిఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకోవటం)షూటింగ్ ఎక్కడ జరిగినా హాజరు కావాలి. దూరం అనే అంశాన్ని తీసుకురావద్దు. ప్రతి నెల రెండో ఆదివారం, పండుగ రోజు (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు)లో పనిచేసిన వారికి మాత్రమే డబుల్ కాల్ షీట్ .. మిగిలిన ఆదివారాల్లో సింగిల్ కాల్షీట్ ఉంటుంది.కార్మికుల నుంచి ప్రధానంగా 2 ప్రతిపాదనలు 30 పర్సెంట్ వేతనాలు పెంచాలి పెంచిన వేతనాలను ఏరోజుకారోజు చెల్లించాలి -
సినీ కార్మికుల సమ్మె 4వ రోజు అప్డేట్: నేడు కీలక చర్చలు
వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా టాలీవుడ్లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజులుగా చర్చలు జరిగినా.. ఫలితం లేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుంటే.. పెంచనిదే పనికి వెళ్లమని కార్మికులు అంటున్నారు. నాలుగో రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ రోజు ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చెర్మెన్, నిర్మాత దిల్ రాజు నుఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలవబోతున్నారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి తమ సమస్యలు వివరిస్తామని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. చిరంజీవి నిర్ణయానికి తాము కూడా కట్టుబడి ఉంటామని చెప్పారు.సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవేరెండు ప్రధాన డిమాండ్స్‌తో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. వాటిలో ఒకటి కార్మికుల వేతనాలు పెంచాలి. రెండోది పెంచిన వేతనాలు ఏరోజుకారోజే ఇవ్వాలి. నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని సమ్మె విరమణపై ఆలోచిస్తామని ఫెడరేషన్ నాయకులు చెప్పారు. పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అని అన్నారు -
అలాంటివారికి మేమున్నాం అని చెప్పేందుకే ఈ వేడుక
‘తెలుగు పరిశ్రమలోని 24 శాఖలతో కలిసి మే డే ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. కరోనా టైమ్‌లో కార్మికులు ఇబ్బందులు పడ్డారు... సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అలాంటి వారికి మేమున్నాం అని చెప్పేలా ఈ వేడుక చేస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా, ఆయనతో పాటు కిషన్ రెడ్డిగారు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు, సబితా ఇంద్రారెడ్డిగారు, భట్టి విక్రమార్కగారు, ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు’’ అని తెలుగు చలన చిత్ర కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. మే 1న ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలను జరపనున్నారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ఈవెంట్ టీ షర్ట్స్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధమయ్యారు. రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ,టీవీ ఆర్టిస్టులకు మంత్రి తలసాని ఈ నెల 28న నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సిద్దం చేసిన సరకులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనుమతులపై దశల వారీగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. -
సమ్మె విరమించిన సినీ కార్మికులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర కార్మికులు సమ్మె విరమించారు. నిర్మాతలతో శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఏడు రోజులుగా చేస్తున్న సమ్మె విరమించారు. రేపటి నుంచి మళ్లీ సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటామని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ తెలిపారు. తమ డిమాండ్లు అంగీకరించినందుకు ఫిలిం ఛాంబర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏడు రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో షూటింగ్ లో ఆగిపోయాయి. ఫలితంగా పలు సినిమాల విడుదల వాయిదాపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.