సీఎం సానుకూలంగా స్పందించారు : తలసాని

Minister Talasani Srinivas Yadav To Help Daily Wage Workers In TV Cinema Industry - Sakshi

14వేల మంది సినీ కార్మికులు,ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్న తలసాని

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సిద్ధమయ్యారు. రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ,టీవీ ఆర్టిస్టులకు మంత్రి తలసాని ఈ నెల 28న నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సిద్దం చేసిన సరకులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్‌ ప్రొడక్షన్‌, షూటింగ్‌లు, థియేటర్‌ల ఓపెనింగ్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనుమతులపై దశల వారీగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top