
చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ఆందోళనకి తెరపడేలా కనిపించడం లేదు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య చర్చలకు నేడు (ఆగష్టు 8) విరామం ఇచ్చారు. నాలుగురోజుల నుంచి వారు సమ్మెలో ఉండటంతో టాలీవుడ్ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
అయితే, ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతలలు 4 ప్రతిపాదనలు ఉంచారు. వాటికి అంగీకారం తెలిపితే వారు కోరిని 30 శాతం జీతం పెంపు అనే అంశంపై ఒక క్లారిటీ రావచ్చు. జీతాల పెంపు అంశంపై మంత్రి కోమటి రెడ్డి , చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. శనివారం జరగబోయే చర్చలు సానుకూలంగా రాణి పక్షంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ కార్మికులు చెప్పుకొస్తున్నారు.
నిర్మాతల 4 ప్రతిపాదనలు ఇవే
కార్మికులు ఖచ్చితమైన కాల్ షీట్లు ఇవ్వాలి. పని గంటల విషయంలో (6Am to 6Pm, 9Am to 9Pm ) ఏదొ ఒక షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలి
ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకోవటం)
షూటింగ్ ఎక్కడ జరిగినా హాజరు కావాలి. దూరం అనే అంశాన్ని తీసుకురావద్దు.
ప్రతి నెల రెండో ఆదివారం, పండుగ రోజు (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు)లో పనిచేసిన వారికి మాత్రమే డబుల్ కాల్ షీట్ .. మిగిలిన ఆదివారాల్లో సింగిల్ కాల్షీట్ ఉంటుంది.
కార్మికుల నుంచి ప్రధానంగా 2 ప్రతిపాదనలు
30 పర్సెంట్ వేతనాలు పెంచాలి
పెంచిన వేతనాలను ఏరోజుకారోజు చెల్లించాలి