గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఇఫీ )లో భాగంగా నిర్వహించిన ఇఫీ పెరేడ్ కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. దేశవ్యాప్తంగా 16 కళా బృందాలు కనుల పండుగ చేసిన ఈ పెరేడ్‌ను ప్రారంభించిన ఘనతను తెలంగాణకు చెందిన గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడీ కళాకారులు దక్కించుకున్నారు.
టాలీవుడ్ తారల సందడి..
ఈ కార్యక్రమంలో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ,నటి శ్రీలీల నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదల రవి, సినీ నటుడు నాజర్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు,మాదల రవీలు మాట్లాడుతూ ప్రాంతీయ భాష నుంచీ పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగిందని గుర్తు చేశారు ప్రాంతాలకతీతంగా అందరినీ ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ఇఫీ లాంటి వేదికలు ఎంతైనా ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు.
56वें भारतीय अंतरराष्ट्रीय फिल्म महोत्सव का भव्य परेड के साथ हुआ शुभारंभ✨
इस दौरान देश की ऐतिहासिक विरासत की छठा बिखेरते कलाकार👇#IFFI56 #IFFI @IFFIGoa pic.twitter.com/xeN768F1J0— पीआईबी हिंदी (@PIBHindi) November 20, 2025


