ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్! | Tollywood actress Shraddha Arya on announcing first pregnancy | Sakshi
Sakshi News home page

Shraddha Arya: ప్రెగ్నెన్సీ ప్రకటించిన శ్రద్ధా ఆర్య.. పోస్ట్ వైరల్!

Sep 17 2024 7:58 PM | Updated on Sep 17 2024 8:08 PM

Tollywood actress Shraddha Arya on announcing first pregnancy

ప్రముఖ నటి  శ్రద్ధా ఆర్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2021లో నావీ అధికారి రాహుల్ నాగల్‌ను ఈ బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. తొలిసారి గర్భం ధరించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇది తెలుసుకున్న బాలీవుడ్ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. ఢిల్లీకి చెందిన శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌ మూవీ నిశ్శబ్ద్‌ చిత్రంలో నటించింది. తెలుగులో 2007లో కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన గొడవ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రోమియో, కోతిమూక  లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. బాలీవుడ్‌లో చివరిసారిగా రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అంతేకాకుండా హిందీలో పలు సీరియల్స్‌తో శ్రద్ధా ఆర్య గుర్తింపు తెచ్చుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement