చిన్నప్పుడు డబ్బులు దొంగతనం చేశా: మంచు లక్ష్మీ | Tollywood actress Manchu Lakshmi comments about her parents | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: చిన్నప్పుడు డబ్బులు దొంగతనం చేశా: మంచు లక్ష్మీ

Jun 23 2026 5:04 PM | Updated on Jun 23 2026 5:13 PM

Tollywood actress Manchu Lakshmi comments about her parents

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు హాజరైన ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. మా నాన్న మోహన్‌ బాబుకు సేవాగుణం మొదటి నుంచే ఉందన్నారు. ఆయన తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేశారని తెలిపారు. నాన్నలాగే నాకు సేవాగుణం ఎక్కువేనని అన్నారు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ పర్సులో నుంచి డబ్బులు దొంగతనంగా తీసుకుని చాలా మందికి ఇచ్చేదాన్ని అంటూ ఫన్నీగా మాట్లాడారు. 

మంచు లక్ష్మీ మాట్లాడుతూ..'నా లైఫ్‌లో ఆదర్శం నాన్నే. నా చిన్నప్పుడు మా ఇంటికి చాలామంది వచ్చేవాళ్లు. దాదాపు రెండు నెలలపాటు ఉండేవాళ్లు. తిరిగి వెళ్లేటప్పుడు నాన్నను ఏదో ఒకటి కావాలని అడిగేవారు. ముక్కు, మొహం తెలియని వాళ్లకు కూడా సాయం చేశారు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా ఎంతో చేశారు. విద్యానికేతన్ ద్వారా ఎంతోమందికి విద్యనందిస్తున్నారు. అలా మమ్మీ పర్సులో డబ్బులు తీసి ఎంతోమందికి ఇచ్చేదాన్ని. స్లమ్స్‌లోకి వెళ్లనప్పుడు వారి జీవన విధానం చూసి బాధపడేదాన్ని. నా వంతు సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటా' అని చెప్పుకొచ్చింది. 

కాగా.. అంతకు ముందు ఈవెంట్‌కు హాజరైన మంచు లక్ష్మీ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. రాను బొంబైకి రాను.. అంటూ సాగే ఫేమస్ ఫోక్‌ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్‌ మంచు లక్ష్మీ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement