
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి అభినయ. శంభో శివ శంబో చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇటీవలే అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా బుధవారం వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది ముద్దుగుమ్మ.
అభినయ-సన్నీ వర్మల పెళ్లి వేడుక ఈ నెల 16న అంటే బుధవారం గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబురాల్లో మునిగిపోయారు. ఇటీవలే తన ఫ్రెండ్స్‌కు బ్యాచ్‌లరేట్ పార్టీ ఇచ్చిన అభినయ మరి కొన్నిగంటల్లోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభియన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. 'నేనింతే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభినయ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి.