కాబోయే వధువరులను ఆశీర్వదించిన మోహన్ బాబు.. ఫోటోలు వైరల్! | Sakshi
Sakshi News home page

Mohan Babu: దిల్ రాజు ఇంట్లో పెళ్లిసందడి.. మోహన్ బాబుకు ప్రత్యేక ఆహ్వానం!

Published Wed, Feb 7 2024 7:52 PM

Tollywood Actor Mohan Babu Given  Blessings To Young Hero - Sakshi

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరగనుంది.  2022లో రౌడీ బాయ్స్‌ చిత్రం ద్వారా ఎంట్రీ  ఇచ్చిన దిల్‌ రాజు మేనల్లుడు  ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించే పనిలో బిజీగా ఉన్నారు దిల్‌రాజు. తాజాగా టాలీవుడ్ నటుడు మోహన్‌ బాబును కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే నూతన వధువరులను మెహన్‌బాబు ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. 

 కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.  ఇరు కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆశిష్ ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. 
 

Advertisement
Advertisement