
'టిల్లు' సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న సిద్ధు చేస్తున్న లేటెస్ట్ సినిమా 'తెలుగు కదా'. స్టైలిష్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబరు 17న మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఇప్పుడు మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజ్ చేశారు. 'మల్లిక గంధ' అంటూ సాగే పాటని సిద్ శ్రీరామ్ పాడాడు.
(ఇదీ చదవండి: సూపర్ హీరోగా కల్యాణి.. అలరించేలా 'లోకా' టీజర్)
తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ ఓవైపు వినసొంపుగా ఉంటూనే బీట్ కూడా వినబడుతోంది. సిద్ధు-రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందించాడు. చూస్తుంటే తమన్ స్వరపరిచిన తొలిపాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)