
హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్స్ గానీ సెలబ్రిటీలు అయిపోయిన తర్వాత కానీ మీడియాలో ఎప్పుడుపడితే అప్పుడు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మాత్రం వీళ్లకు సంబంధించిన పాత ఫొటోలు లేదంటే చిన్ననాటి చిత్రాలు బయటపడుతుంటాయి. అప్పట్లో ఇలా ఉండేవారా అని నెటిజన్ల ఆశ్చర్యపోవడం గ్యారంటీ. ఇప్పుడు అలానే ఓ తెలుగు డైరెక్టర్.. తన టీనేజీ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఇతడెవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్నది డైరెక్టర్ సాయి రాజేశ్. ఇలా చెబితే కొందరు గుర్తుపడతారు గానీ 'బేబి' మూవీ తీసిన దర్శకుడు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ అంతా ఈ మూవీ చూసి తెగ ఫీలయిపోయారు. కొందరైతే థియేటర్లలోనే ఏడ్చేశారు కూడా! అయితే సాయి రాజేశ్‌కి ఇదే తొలి చిత్రం కాదు.. గతంలో రెండు తీశాడు కాకపోతే అవి కామెడీవి కావడంతో పెద్దగా రిజిస్టర్ కాలేదు.
(ఇదీ చదవండి: అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!)
నెల్లూరుకి చెందిన సాయి రాజేశ్.. టాలీవుడ్‌లో తీసిన తొలి సినిమా 'హృదయ కాలేయం'. సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి తీశాడు. కానీ తన పేరు మాత్రం స్టీఫెన్ శంకర్ అని వేసుకున్నాడు. తర్వాత ఇదే సంపూర్ణేశ్ బాబుతో 'కొబ్బరిమట్ట' అనే చిత్రం తీశాడు. ఈ రెండూ బాగానే ఆడాయి కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో రూట్ మార్చాడు. 'కలర్ ఫొటో' అనే చిత్రానికి స్టోరీ అందించిన సాయి రాజేశ్.. నిర్మాతగానూ వ్యవహరించాడు. నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. 'బేబి'కి కూడా జాతీయ సినీ అవార్డ్ రావడం విశేషం.
'బేబి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేశ్.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. చాన్నాళ్ల నుంచి ముందుకు కదట్లేదు. మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ'కి స్టోరీ అందిస్తున్నాడు. మరి సాయి రాజేశ్ నుంచి తర్వాత సినిమా ఎప్పుడొస్తుందో ఏంటో?
(ఇదీ చదవండి: నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్)