
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తివిక్రమ్‌తో సినిమా చేయాల్సింది. కానీ అనూహ్యంగా అట్లీతో సినిమా(AA22)ను ప్రకటించి షాకిచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇంత త్వరగా సెట్స్‌పై వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. పనులన్నీ చకచక పూర్తి చేసి..షూటింగ్‌ని ప్రారంభించారు. తాజాగా ఈ మూవీకి సంబంధిచి ఓ క్రేజీ రూమర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికిగానూ అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట.
తగ్గేదేలే..
మొన్నటి వరకు తెలుగు నుంచి ప్రభాస్(Prabhas) ఒక్కడే ఇండియన్ బాక్సాఫీస్‌ని శాసించాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో బన్నీ కూడా చేరిపోయాడు. ఆయన నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డును సృష్టించింది. ఈ చిత్రం తర్వాత బన్నీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న చిత్రానికి అత్యధికంగా రూ. 180 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే రూ. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్‌ని దాటేశాడు బన్నీ. మార్కెట్‌లో తనకున్న డిమాండ్ దృష్ట్యా.. నిర్మాతలు కూడా అంత పెద్దమొత్తంలో ఇవ్వడానికి ఒకే చెప్పేశారట. చిత్ర దర్శకుడు అట్లీ, హీరోయిన్ దీపికా పదుకొణెలు కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారట.
కొత్త ప్రపంచం
ఇప్పుడు బన్నీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఆ అంచనాలను మించేలా అట్లీ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇందుకుగాను అట్లీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడట. అది ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నాడు. రూ. 700 కోట్ల బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
గ్రాఫిక్స్ కోసమే రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే.. విజువల్స్ పరంగా సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్‌కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.