అంబాజీపేట బ్యాండు  | Teaser for Ambajipeta Marriage Band is out | Sakshi
Sakshi News home page

అంబాజీపేట బ్యాండు 

Oct 10 2023 1:05 AM | Updated on Oct 10 2023 1:05 AM

Teaser for Ambajipeta Marriage Band is out  - Sakshi

సుహాస్, శివాని 

సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్‌ కటికినేని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్‌ మహా బ్యానర్‌ మహాయన మోషన్‌ పిక్చర్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్‌ విడుదలలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్‌ కొలను, సాయి రాజేశ్, సందీప్‌ రాజ్, ప్రశాంత్, మెహర్‌ రమేశ్, భరత్‌ కమ్మ, నిర్మాతలు ఎస్‌కేఎన్, శరత్‌ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘నాలాంటి కొత్త డైరెక్టర్‌కు చాన్స్‌ ఇచ్చిన అల్లు అరవింద్, ‘బన్ని’ వాసు, వెంకటేష్‌ మహాగార్లకు, సుహాస్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు దుశ్యంత్‌ కటికినేని. ‘‘నా కెరీర్‌లో ఈ మూవీ మైలురాయిగా నిలుస్తుంది’’అన్నారు సుహాస్‌. సినిమాటోగ్రాఫర్‌ వాజిద్‌ బేగ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement